పిలవని పెళ్లికి వెళ్లి రూ.200 గిఫ్ట్ వద్దనేసరికి నానా రభస - వధువు తండ్రిని కొట్టిన యువకుడు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 13, 2022, 8:21 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

పిలవని పేరంటానికి వెళ్లిన యువకుడు అక్కడి అతిథులపై దాడి చేశాడు. కానుకలు స్వీకరించలేదని అభిజిత్ అనే యువకుడు వివాహ విందులో హల్​చల్ చేశాడు. కేరళలోని తిరువనంతపురంలో ఈ ఘటన జరిగింది. వధువు సోదరుడికి స్నేహితుడైన అభిజిత్​కు వివాహానికి ఆహ్వానం అందలేదు. గతంలో గొడవ జరిగిన కారణంగా అభిజిత్​ను పెళ్లికి, రిసెప్షన్​కు పిలవలేదు వధువు సోదరుడు. అయినప్పటికీ అభిజిత్ రిసెప్షన్​కు వెళ్లాడు. అనంతరం పెళ్లి కానుకగా 200 రూపాయలు ఇచ్చాడు. కానుకను తీసుకునేందుకు వధువు తండ్రి అనిల్ కుమార్ నిరాకరించాడు. దీంతో అతిథులపై దాడి చేశాడు అభిజిత్. ఈ దాడిలో అనిల్​తో పాటు పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసుల సమక్షంలో పెళ్లి జరిగింది.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.