ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి వెళ్లిన కారు- ఆస్పత్రికి తరలించేలోపే మృతి - కారు ఢీకొని చిన్నారి మృతి
🎬 Watch Now: Feature Video
Published : Dec 27, 2023, 3:35 PM IST
Child Dead Car Crash : కర్ణాటక బీదర్లో హృదయ విదారక ఘటన జరిగింది. రోడ్డు పక్కన ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి పైనుంచి ఓ కారు వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు చిన్నారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన హరోగరి ప్రాంతంలో మంగళవారం జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చిన్నారి పైనుంచి వెళ్లిన కారు
ఇటీవలె కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ ఇలాంటి ఘటన జరిగింది. ఓ అపార్ట్మెంట్ ఎదురుగా ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి కారు దూసుకెళ్లింది. ఆ తర్వాత చిన్నారిని ఏడవడాన్ని గమనించిన తల్లిదండ్రులు గేటులో ఇరుక్కుపోయి ఏడుస్తోందని భావించారు. ఆ తర్వాత సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, చిన్నారి భుజం విరిగిపోయిందని చెప్పారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మరణించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి