Cheetah Roaming In Bangalore Viral video: అపార్ట్మెంట్ మెట్లు, లిఫ్ట్ దగ్గర చిరుతపులి హల్చల్.. జనాలు హడల్.. - బెంగళూరులో చిరుత సంచారం వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video
Published : Oct 31, 2023, 10:45 AM IST
Cheetah Roaming In Bangalore Viral video : కర్ణాటకలోని బెంగళూరు శివారు ప్రాంతంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. మూడు రోజులుగా అక్కడే మకాం వేసిన చిరుత వీధుల గుండా తిరుగుతూ స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి. 'నగర శివారు బొమ్మనహళ్లిలోని సింగసంద్ర, హోస్పాళ్య, కుడ్లుభాగా ప్రాంతాల్లో గత మూడు రోజులుగా చిరుత పులి సంచరిస్తుంది. వీధుల్లో తిరుగుతూ మేము ఉండే అపార్ట్మెంట్ సెల్లార్, లిఫ్టు దగ్గర, పార్కింగ్ ఏరియాల్లో, మెట్లపైకి వస్తుంది. ఉదయాన్నే వృద్ధులు బయటకు వాకింగ్ కోసం వెళ్తారు. కనుక వాళ్లతో పాటు స్థానికులందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నాం. దానిని అటవీ శాఖ ఆఫీసర్లు త్వరగా పట్టుకోవాలని కోరుతున్నాము' అని స్థానికుడు ఒకరు పేర్కొన్నారు. దీనిపై సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది చిరుత పులి కోసం గాలిస్తున్నారు. అప్పటివరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు మైక్‌ల ద్వారా విజ్ఞప్తి చేశారు.