దేవుడి రథోత్సవాల్లో అపశ్రుతి - చామరాజ్నగర్లో కూలిన రథం
🎬 Watch Now: Feature Video
కర్ణాటకలో దేవుడి రథోత్సవాల్లో అపశ్రుతి నెలకొంది. చామరాజ్నగర్లోని చెన్నప్పనపురంలో ఓ రథం కూలింది. రెండేళ్ల తరవాత వీరభద్రేశ్వర స్వామి ఆలయం వద్ద ఉత్సవాలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో రథం చుట్టూ దాదాపు 800 మంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. రథోత్సవం జరగకపోయినా దేవుడికి ఇతర పూజలు చేసినట్లు గ్రామస్థులు చెప్పారు.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST