Chandrababu Go To Hyderabad Today: అమరావతి నుంచి హైదరాబాద్‌కు వెళ్లనున్న టీడీపీ అధినేత చంద్రబాబు - Chandrababu go to Hyderabad from Amaravati
🎬 Watch Now: Feature Video
Published : Nov 1, 2023, 7:41 AM IST
|Updated : Nov 1, 2023, 10:09 AM IST
Chandrababu Go To Hyderabad Today : మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu ) ఇవాళ అమరావతి నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. చంద్రబాబు హైదరాబాద్ వచ్చి ఏఐజీ, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిల్లో చికిత్స చేయించుకొనున్నారు. రాజమండ్రి నుంచి నిన్న సాయంత్రం 4:45 సమయంలో బయలుదేరిన చంద్రబాబు.. తెల్లవారుజామున ఉండవల్లిలోని (Chandrababu Reached Undavalli ) తన నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబును చూసేందుకు అభిమానులు పోటెత్తటంతో పాటు పోలీసులు ట్రాఫిక్ నియంత్రించకుండా చేతులెత్తేయటంతో 12 గంటలు పైగా నిర్విరామంగా ప్రయాణం సాగింది. చంద్రబాబు అలిసి పోవటంతో ఇవాళ ఎవరినీ కలవకుండా విశ్రాంతి తీసుకోవాలని నాయకులు కోరారు. సాయంత్రం 4 గంటల సమయంలో చంద్రబాబు హైదరాబాద్ బయలుదేరి రానున్నారు.
భావోద్వేగంతో బాబుకు దండాలు పెట్టిన అభిమానులు : 52 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబును చూసేందుకు ఎక్కడికక్కడే రోడ్లపైకి తరలి వచ్చారు. కాన్వాయ్‌కు ఎదురెళ్లి చంద్రబాబుకు విజయ సంకేతం చూపించారు. కొందరు భావోద్వేగంతో దండాలు పెట్టారు. వారందికీ అభివాదం చేస్తూ చంద్రబాబు వాహన శ్రేణి ముందుకు సాగింది.