Chandrababu bail petition in skill case : స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్.. ప్రత్యేక బెంచ్ విచారణ - చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్
🎬 Watch Now: Feature Video
Published : Oct 27, 2023, 11:40 AM IST
Chandrababu bail petition in skill case: స్కిల్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ ఇవాళ వాదనలు వినాల్సి ఉంది. కానీ, జస్టిస్ జ్యోతిర్మయి 'నాట్ బిఫోర్ మీ' అని విచారణ నుంచి తప్పుకున్నారు. ఏ బెంచ్ విచారించాలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించనున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబు.. హైకోర్టులో బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ? ఆయా అనుబంధ పిటిషన్లపై (Chandrababu Bail Petition) దసరా సెలవుల ప్రత్యేక బెంచ్ ఇవాళ విచారణ జరపనుంది.
స్కిల్ కేసులో ఏసీబీ కోర్టు (ACB Court) బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బెంచ్ ముందు 8వ కేసుగా బెయిల్ అభ్యర్థన విచారణ జాబితాలోకి వచ్చింది. హైకోర్టు ఈ నెల 19న ఈ పిటిషన్‌పై విచారణ జరిపి.. వెకేషన్ బెంచ్‌కు అప్పగిస్తూ.. వాయిదా వేసింది. విచారణ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, వైద్య నివేదికలను విచారణ కోసం కోర్టు ముందుంచాలని రాజ మహేంద్రవరం జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది.