బెంగళూరు విమానాశ్రయంలో కలుసుకున్న చంద్రబాబు-డీకే శివకుమార్ - చంద్రబాబు డీకే
🎬 Watch Now: Feature Video


Published : Dec 28, 2023, 8:51 PM IST
|Updated : Dec 28, 2023, 8:59 PM IST
Chandrababu and DK Shivakumar Met in Bengaluru Airport : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ అనూహ్యంగా కలుసుకున్నారు. బెంగళూరు విమానాశ్రయంలో ఇవాళ పరస్పరం ఎదురయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం వెళ్లేందుకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లగా, అదే సమయంలో కాంగ్రెస్ ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు నాగ్‌పూర్ వెళ్లేందుకు డీకే శివకుమార్ విమానాశ్రయానికి వచ్చారు. పరస్పరం ఇద్దరూ ఎదురు కావడంతో మర్యాద పూర్వకంగా కరచాలనం చేసుకున్నారు. డీకే శివకుమార్ చంద్రబాబును పక్కకు తీసుకెళ్లి కాసేపు ముచ్చటించారు. ఇద్దరు నేతలు మర్యాదపూర్వకంగానే కలిశారని తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి. ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని వెల్లడించాయి.
అనంతరం బెంగళూరులో చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు త్రిలోక్‌ను పరామర్శించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో కుప్పంలో ఆందోళన చేస్తున్న త్రిలోక్ ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర అనారోగ్యానికి గురైన త్రిలోక్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. టీడీపీ అండగా ఉంటుందని త్రిలోక్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. అనంతరం టీడీపీ ఫారంలో పాల్గొన్నారు.