Chakra Snanam Completed: వైభవంగా ముగిసిన తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు - శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్ర స్నానం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2023, 8:22 PM IST

Chakra Snanam Completed in Tirumala Srivari Brahmotsavam 2023 : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. 8 రోజుల పాటు వివిధ వాహన సేవలపై వివిధ అలంకరాల్లో మలయప్ప స్వామి నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్ర స్నానాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 53 నిమిషాల వరకు శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి, చక్రత్తాళ్వర్​కు అర్చకులు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించారు. అనంతరం చక్రత్తాళ్వరుకు అర్చకులు పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు. అలంకార ప్రియుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో కీలక ఘాట్టాలు ముగిశాయి. వచ్చే నెల 15న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం సిద్ధం అవుతోంది.

సాలకట్ల బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వైభవోపేతంగా నిర్వహించింది. చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా ముందుస్తు చర్యలు చేపట్టి విజయవంతం చేసింది. భక్తులకు పెద్దపీట వేస్తూ ఆలయంలోని పలు ఆర్జిత సేవలను టీటీడీ నిర్వహించింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.