రాష్ట్ర మంత్రికి చేతులతో చెప్పులు తొడిగిన కేంద్ర మంత్రి - Central Minister jyothioraditya Scindhia

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 26, 2022, 1:29 PM IST

Updated : Feb 3, 2023, 8:37 PM IST

మధ్యప్రదేశ్ రాజకీయాల్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఆ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి ప్రద్యుమన్​ సింగ్​ తోమర్ మరోసారి వార్తల్లో నిలిచారు​. దాదాపు 2 నెలల తర్వాత ఎట్టకేలకు ఆయన చెప్పులు ధరించారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గ్వాలియర్​లో స్వయంగా ఆయనకు చెప్పులు తొడిగారు. గ్వాలియర్​ నగరంలో అధ్వానంగా మారిన రోడ్లు బాగుచేయాలని నిరసిస్తూ ప్రద్యుమన్​ సింగ్​ ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి చెప్పులు వేసుకోకుండానే తిరుగుతున్నారు. రోడ్ల మరమ్మతులు చేస్తేనే తాను చెప్పులు వేసుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. ఇటీవలే రోడ్ల పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆదివారం ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తన చేతులతో ప్రద్యుమన్​సింగ్​ తోమర్​కు చెప్పులు తొడిగారు. అనంతరం సింగ్.. సింధియా పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.