Theft at petrol station : గొప్పోడిగా బిల్డప్ ఇచ్చాడు.. కౌంటర్‌లో క్యాష్‌తో ఉడాయించాడు - వైరల్ వీడియోలు
🎬 Watch Now: Feature Video

Theft at Shadnagar petrol station : ఓ దొంగ మంచిగా బిల్డప్ ఇస్తూ గొప్పోడిగా నటిస్తూ తన వంకర బుద్ధికి పని చెప్పాడు. పక్కనే తన వాహనం ఆగిపోయిందని లీటర్ పెట్రోల్ కావాలంటూ వచ్చి.. చిల్లర కోసం కౌంటర్ కార్యాలయంలోకి ప్రవేశించాడు. అక్కడ తనదైన స్టైల్‌లో రూ.20వేలు దొంగతనం చేసి చక్కగా అక్కడి నుంచి పరారయ్యాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఫరూక్‌నగర్ మండలంలోని శ్రీ వెంకటరమణ ఫిల్లింగ్ స్టేషన్‌లో జరిగింది.
బాధితుల కథనం ప్రకారం.. ఈనెల 6వ తేదీ రాత్రి ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ కోసమని బంక్‌కు వచ్చారు. పక్కనే తమ వాహనం ఆగిపోయిందని బంక్‌లో పనిచేస్తోన్న నిర్వాహకులతో మాట కలిపారు. అనంతరం చిల్లర కోసం కార్యాలయంలోకి వెళ్లి వారితో ముచ్చటించారు. సందర్భం చూసి కౌంటర్ నుంచి రూ.20వేలు తీసుకొని పరారయ్యారు. బంక్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాను పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.