Car Rams Into Police Viral Video : కానిస్టేబుల్​పైకి దూసుకెళ్లిన కారు.. గాల్లోకి అమాంతం ఎగిరి.. - Car Rams Into Police Viral Video

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 1:40 PM IST

Car Rams Into Police Viral Video : దిల్లీలోని కన్నాట్​ ప్లేస్​లో ఓ పోలీసు కానిస్టేబుల్​పైకి కారు దూసుకెళ్లింది. పోలీసు బారికేడ్లవైపు వేగంగా దూసుకొచ్చిన ఎస్​యూవీ వాహనం.. అక్కడే ఉన్న కానిస్టేబుల్​ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ పోలీసు అమాంతం ఎగిరి కొన్ని అడుగుల దూరంలో పడ్డారు. తీవ్ర గాయాలైన కానిస్టేబుల్​ను ఆస్పత్రికి తరలించారు. అయితే కానిస్టేబుల్​ను ఢీకొట్టిన తర్వాత కారు ఆగకుండా వెళ్లిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన దిల్లీ పోలీసులు కారును ఛేజ్​ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అక్టోబర్​ 25 తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. చికిత్స తర్వాత కానిస్టేబుల్ ఆస్పత్రికి నుంచి డిశ్చార్జ్ అయ్యారని.. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీటీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.  

బానెట్​పై పోలీసును లాక్కెళ్లిన కారు..  
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్​ ఇందౌర్​ సమీపంలో లసుడియా పోలీస్ స్టేషన్​ పరిధిలో జరిగింది. క్రాస్​రోడ్​లో ట్రాఫిక్ పోలీసులు వేగంగా వెళ్తున్న ఓ కారును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే ఆ డ్రైవర్ రెడ్ లైట్ పడినా కారును ఆపకుండా పోలీసు​ పైకి దూసుకెళ్లాడు. దీంతో ట్రాఫిక్ పోలీస్ కారు బానెట్​పై పడిపోయాడు. అయినాసరే కారును ఆపకుండా డ్రైవర్ చాలా దూరం వరకు పోలీసును లాక్కొని వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.