పల్టీలు కొట్టి రోడ్డుపై గింగిరాలు తిరిగిన కారు.. ప్రయాణికులంతా సేఫ్ - కేరళ కారు ప్రమాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 22, 2023, 10:00 PM IST

వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంటి గోడను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారు గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టింది. చివరకు రోడ్డుకు అడ్డంగా కారు బోల్తా పడి గింగిరాలు తిరిగింది. ఈ ఘటన కేరళ కోజికోడ్​లోని కారుమాలా ప్రాంతంలో మంగళవారం రాత్రి 10.30 గంటలకు జరిగింది. కారులో ఓ చిన్నారి సహా నలుగురు ప్రయాణికులు ఉన్నారు. అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఓ మహిళకు స్వల్పంగా గాయాలయ్యాయి. మిగిలిన వారికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. కట్టిప్పరా ప్రాంతానికి చెందిన వీరంతా కినలూర్​లోని ఓ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల వీరంతా క్షేమంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.