లైవ్ వీడియో.. ఓవర్ స్పీడ్‌లో కారు.. బైక్‌తో పాటు ఇద్దరు విద్యార్థులను ఢీ - బైక్‌తో పాటు ఇద్దరు విద్యార్థినులను ఢీకొట్టిన కారు
🎬 Watch Now: Feature Video

Car Hit Bike And Students : అతివేగంతో వచ్చిన ఓ కారు.. బైక్‌తో పాటు ఇద్దరు విద్యార్థులను ఢీకొట్టింది. ఘటనలో బైకర్ తీవ్రంగా గాయపడ్డాడు. విద్యార్థినిలు మాత్రం చిన్న చిన్న గాయాలపాలై.. ప్రాణాలతో బయటపడ్డారు. జులై 18న ఈ ఘటన జరగ్గా.. అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని రాయ్‌చూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. స్టేషన్ రోడ్‌లోని శ్రీ రాఘవేంద్ర పెట్రోల్ బంక్ సమీపంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడం సీసీటీవీ ఫుటేజ్‌లో మనం చూడొచ్చు. దానికి ముందు బైకర్‌ను కూడా బలంగా ఢీకొట్టడం గమనించవచ్చు. కులసుంబి బేరంగి ప్రాంతానికి చెందిన బైకర్ శివరాజ్ పాటిల్.. ఘటనలో తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మానవి నియోజకవర్గానికి చెందిన జ్యోతి, శివమంగళ అనే విద్యార్థినిలు స్వల్పంగా గాయపడినట్లు వారు వెల్లడించారు. ఘటనపై రాయ్‌చూర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
TAGGED:
viral videos