Car Fire Petrol Bunk Viral Video : పెట్రోల్‌బంక్‌లో ఉన్న కారులో సడెన్‌గా మంటలు.. అంతా హడల్! - కారు అగ్నిప్రమాదం వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video
Published : Sep 12, 2023, 10:35 PM IST
Car Fire Petrol Bunk Viral Video : పెట్రోల్ బంక్‌లో ఆగి ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే బంక్ సిబ్బంది అప్రమత్తతంగా ఉండడం వల్ల పెను ప్రమాదం తప్పింది. కర్ణాటకలోని బెళగావిలో ఈ ఘటన జరిగింది. అసలేమైందంటే?
బెళగావి.. నెహ్రూనగర్‌లోని శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ సమీపంలో ఉన్న హోస్మానీ అండ్ సన్స్‌కు చెందిన పెట్రోల్ బంక్‌కు ఓ వ్యక్తి కారులో వచ్చాడు. డీజిల్‌ను పోయమని బంక్ సిబ్బందికి చెప్పాడు. ఇంతలో కారు బానెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే కారు దిగి డ్రైవర్ పరారయ్యారు. మంటలు చెలరేగుతుండడం వల్ల పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అక్కడే ఉన్న ఫైర్ పరికరాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.
ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన బంక్ వద్దకు చేరుకున్నారు. వెంటనే ఫైరింజన్‌తో మంటలు ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు పెట్రోల్ బంక్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. బెళగావిలోని షాహాపుర్.. భరత్ నగర్లో నివాసం ఉంటున్న నరేంద్ర బిర్జేకి చెందిన కారుగా స్థానికులు గుర్తించారు.