కుక్కకు 'బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద మంత్' అవార్డ్.. క్యాష్ ప్రైజ్.. ఎందుకంటే..?
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్ పోలీస్ శాఖకు చెందిన ఓ కుక్క 'బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద మంత్'గా అవార్డు పొందింది. ఓ హత్య కేసును ఛేదించినందుకు ఈ పురస్కారాన్ని అందించారు అధికారులు. రూ. 2,500 నగదు పురస్కారాన్ని అందజేశారు. జస్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 6న షకీబ్ అహ్మద్ అనే వ్యక్తి హత్య జరిగింది. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. ఈ క్రమంలోనే అనుమానితులను వరుసగా నిలబెట్టగా.. కేవలం 30 సెకన్లలోనే నిందితుడిని పట్టించింది ఈ శునకం. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం చేసినట్లు అంగీకరించాడు. ఈ కేసును ఛేదించడంలో శునకం కీలక పాత్ర పోషించిందని.. అందుకే అవార్డుతో పాటు నగదు పురస్కారాన్ని ప్రకటించామని ఉద్దమ్ సింగ్ నగర్ ఎస్ఎస్పీ మంజునాథ్ తెలిపారు. 2016లో హరియాణాలోని పంచకుల ఐటీబీపీ కేంద్రంలో ఈ శునకానికి శిక్షణ ఇచ్చారు. అనంతరం ఉద్దమ్‌సింగ్ నగర్లో పోస్టింగ్ ఇచ్చారు. అనేక హత్య కేసుల్లో పోలీసులకు సహాయం అందించింది. ప్రస్తుతం 8 ఏళ్ల వయసున్న ఈ శునకం ట్రాకర్ డాగ్‌గా పేరొందింది.