Campus Placements in kL University : క్యాంపస్ నియమాకాల్లో సత్తా చాటిన విద్యార్థులు.. 50.57 లక్షల వార్షిక ప్యాకేజీ - Telangana latest news
🎬 Watch Now: Feature Video
Published : Oct 11, 2023, 3:56 PM IST
Campus Placements in KL University : కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో నిర్వహించిన క్యాంపస్ నియమాకాల్లో.. యూనివర్సీటీ విద్యార్ధులు సత్తా చాటారు. అమెరికాకు చెందిన నూటానిక్స్ అనే అంతర్జాతీయ కంపెనీలో 50.57 లక్షల వార్షిక ప్యాకేజీతో నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. అధిక వేతనంతో ప్రాంగణ నియమాకాల్లో ఉద్యోగాలు సాధించినందుకుగాను.. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Campus Selections in KL University : విద్యార్థులకు మొదటి సంవత్సరం నుంచే కోడింగ్‌లో నైపుణ్యం పొందేలా శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రతిభ చూపించారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగాలు పొందిన విద్యార్థినులైన.. హర్షిణి, హారిక, విద్యశ్రీలను, వారి తల్లిదండ్రులను యూనివర్సిటీ అధికారులు సన్మానించారు. ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్యాలతో కూడిన సంపూర్ణ సాంకేతిక విద్యను అందిస్తున్నట్లు డాక్టర్ రామకృష్ణ చెప్పారు. విద్యార్దులు చదువు పూర్తి చేసుకోకముందే వారికి అత్యధిక వార్షిక ప్యాకేజీతో కూడిన ఉద్యోగాలు రావడం ఆనందంగా ఉందన్నారు.