Butter Festival : వినూత్నంగా 'వెన్న హోళీ'.. 11వేల అడుగుల ఎత్తులో ఘనంగా వేడుకలు - వెన్న హోళీ వేడుకలు ఉత్తరాఖండ్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 8, 2023, 12:44 PM IST

Butter Festival Uttarakhand : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో వినూత్నంగా 'వెన్న హోళీ' జరుపుకున్నారు అక్కడి ప్రజలు. ఒకరికొకరు వెన్న, పాలు, పెరుగు, నెయ్యి పూసుకుంటూ ఆనందంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దయారా బుగ్యాల్ ప్రాంతంలో.. 11వేల అడుగుల ఎత్తున్న హిమాలయాలపై ఈ వేడుకలు జరుపుకొన్నారు. రథాల్, నతిన్, భట్వాడి, క్యార్క్, బాంద్రాని గ్రామాలకు చెందిన ప్రజలు ఇందుల్లో పాల్గొన్నారు. ప్రకృతికి కృతజ్ఞత భావంతో ఏటా ఈ హోళీని ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఆ ప్రాంతవాసులు. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ఈ వెన్న హోళీ వేడుకలు జరుగుతాయి.

అయితే దయారా బుగ్యాల్ ప్రాంతంలో ఉన్న పచ్చిక బయళ్లలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఆ బయళ్లను ఆవులు తింటే సమృద్ధిగా పాలు ఇస్తాయట. దీంతో ప్రతి సంవత్సరం కొద్ది రోజుల పాటు.. పచ్చిక బయళ్లను మేపేందుకు పశువులను తీసుకువెళతారు పరిసర ప్రాంత ప్రజలు. అనంతరం తిరిగి వస్తూ ఈ వేడుకలను జరుపుకుంటారు. కొన్నేళ్లుగా ఈ  సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. స్పెయిన్‌లోని టమాటా ఫెస్టివల్​ తరహాలో ఇది కూడా ఉంటుందని వారు అంటున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.