మహిళను ఢీకొట్టిన బస్సు- అక్కడికక్కడే మృతి- సీసీటీవీలో లైవ్ వీడియో - బస్సును ఢీకొనిన బైక్
🎬 Watch Now: Feature Video
Published : Dec 12, 2023, 10:03 AM IST
Bus Accident In Karnataka : డ్రైవర్ అజాగ్రత్త కారణంగా కేఎస్ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన కర్ణాటకలోని మండ్య జిల్లాలో జరిగింది. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బెంగళూరుకు చెందిన పూజా భారతి(40) మండ్య జిల్లా బస్టాండ్‌కు వస్తుండగా వెనుక నుంచి వచ్చిన బస్సు ఢీకొట్టింది. అక్కడిక్కడే మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అతివేగంగా వచ్చి బస్సు ఢీకొట్టిన బైక్..
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. కుణిగల్ పట్టణంలోని బస్టాండ్ దగ్గర బైక్ అతివేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. ఆ వ్యక్తి హెల్మెట్ ధరించటం వల్ల అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ దృశ్యాలు అదే మార్గంలో వెళ్తున్న మరో ద్విచక్రవాహనదారుడి హెల్మెట్ కెమెరాలో రికార్డయ్యాయి.