మురికి కాలువలో నోట్ల కట్టలు.. ఎగబడ్డ జనం.. పోలీసులు వచ్చి.. - కాలువలో డబ్బులో కోసం ఎగబడ్డ జనం
🎬 Watch Now: Feature Video
బిహార్ రోహ్తాస్ జిల్లాలోని ఓ మురుగు కాలువలో నోట్ల కట్టలు ఉన్నాయనే వార్తతో స్థానికులందరు భారీగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున కాలువ వద్దకు చేరుకుని డబ్బుల కోసం వెతికారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ నోట్ల కట్టల కోసం కాలువ వద్దకు చేరి వెతకడం ప్రారంభించారు. సాసారంలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయినా వారేం చేయలేకపోయారు. పోలీసులు మాత్రం ఇదంతా పుకార్లు మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. అయితే స్థానిక ప్రజలు మాత్రం.. తమకు నోట్ల కట్టలు దొరికాయని చెబుతున్నారు. శనివారం ఉదయం తాము కాలువలో నోట్లు తేలడాన్ని గుర్తించామని వారు వెల్లడించారు. దీంతో అందులోకి దిగి డబ్బులు కోసం వెతుకామని పేర్కొన్నారు. కాలువలో నోట్ల కట్టలు ఉన్నాయనే సమాచారం.. కొంత సమయంలోనే ఊరంతా పాకిందని వారు వెల్లడించారు. దీంతో చాలా మంది కాలువ వద్దకు చేరుకుని డబ్బుల కోసం వెతికారని తెలిపారు.