క్లీన్ చేస్తుండగా పేలిన తుపాకీ- మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్- అక్కడికక్కడే! - bullet fired from inspector pistol in aligarh
🎬 Watch Now: Feature Video
Published : Dec 8, 2023, 9:46 PM IST
|Updated : Dec 8, 2023, 9:53 PM IST
Bullet Fired From Sub Inspector Pistol In Aligarh : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో పాస్‌పోర్టు వెరిఫికేషన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళ తలలోకి తూటా దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్ఐ తుపాకీని శుభ్రం చేస్తుండగా పొరపాటున పేలిన దృశ్యాలు పోలీస్‌స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో రికార్డయిన దృశ్యాలను పరిశీలిస్తే- ఓ మహిళ పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి అక్కడే కాసేపు నిలబడ్డారు. ఆ కాసేపటికే ఒక పోలీస్ అధికారి వచ్చి ఎస్ఐకి తుపాకీ ఇవ్వడం దానిని శుభ్రం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ అది పేలి తూటా ఎదురుగా ఉన్న మహిళ తలలోకి దూసుకెళ్లడం వంటి దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సబ్ ఇన్‌స్పెక్టర్ మనోజ్ శర్మపై కేసు నమోదు చేసి అతడిని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అతడిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన మహిళకు వైద్యుల బృందం చికిత్స అందిస్తోందని చెప్పారు.