బుల్​ రేసులో ఎద్దు వీరంగం.. పది మందికి గాయాలు.. లైవ్​ వీడియో - వైరల్ వీడియోలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 12, 2023, 10:07 AM IST

కర్ణాటకలోని విజయపుర జిల్లాలో జరిగిన బుల్​ రేస్​లో ఓ ఎద్దు వీరంగం సృష్టించింది. ఈ ఘటనలో పది మంది గాయపడ్డారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బబలేశ్వర్ తాలూకాలోని కఖండకి గ్రామంలో ఈ ఘటన జరిగింది. కాగా శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఎద్దుల పోటీ​లో పాల్గొన్న పోటీదారులను.. ఎద్దు తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన వారందరూ స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదీ జరిగింది
ప్రతి ఏటా జూన్​లో.. వర్షాకాల ప్రారంభంలో ఘనంగా ఎద్దుల పోటీలు నిర్వహిస్తారు గ్రామస్తులు. తొలకరి వానల సందర్భంగా ఈ ఎద్దుల పోటీలు ఘనంగా జరుగుతాయి. ఎద్దుల పోటీల ఆనవాయితీని కొన్నేళ్లుగా కొనసాగిస్తూ వస్తున్నారు గ్రామస్తులు. ఈ వేడుకుల తరువాతే గ్రామస్తులంతా వ్యవసాయ పనులు మొదలుపెడతారు. ఎద్దులను సుందరంగా అలంకరించి.. వాటిని పోటీలకు ముస్తాబు చేస్తారు వాటి యజమానులు. అయితే, ప్రమాదమని తెలిసిన చాలా మంది యువకులు ఈ ఎద్దుల పోటీల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాలను చూసేందుకు వందల సంఖ్యలో జనం హాజరవుతారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా వేడుకలకు భారీగా తరలివస్తారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.