Buildings Collapse In Kullu : హిమాచల్లో వర్ష బీభత్సం.. పేకమేడల్లా కూలిన భవనాలు - హిమాచల్ ప్రదేశ్ లేటెస్ట్ వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Aug 24, 2023, 12:48 PM IST
Buildings Collapse In Kullu Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లూలో కొండచరియలు విరిగిపడి అనేక సంఖ్యలో నివాస భవనాలు నేలమట్టం అయ్యాయి. క్షణాల్లోనే కులు లోయలోని ప్రభావిత ప్రాంతమంతా.. భయానకంగా తయారైంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ మరణించలేదని సమాచారం. కులులోని అన్నీ బస్టాండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. క్షణ కాలంలో జరిగిన ఊహకందని విధ్వంసంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Himachal Pradesh Landslide : కుల్లూలో కుప్పకూలిన 8 భవనాలు సురక్షితం కావని ఐదారు రోజుల క్రితమే అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలకు ఈ భవనాల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయని గుర్తించి స్థానికులను ఇళ్లు ఖాళీ చేయించారు. ఈ భవనాల్లో దుకాణాలు, బ్యాంకులు ఇతర నివాసాలు ఉన్నట్లు తెలిపారు. గురువారం అన్ని భవనాలు ఒకదాని తర్వాత మరొకటి నేలమట్టం అవడం వల్ల భారీగా ధూళి మేఘాలు ఏర్పడ్డాయి. ఈ ప్రమాద తీవ్రతను చూసిన అధికారులు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించారు. కొండచరియలు విరిగిపడే అవకాశమున్న ఇతర ప్రాంత ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.
Himachal Pradesh Death Toll : హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాల కారణంగా తలెత్తిన ప్రమాదాలకు ఈ ఒక్క నెలలోనే 120 మంది మృత్యువాత పడగా.. ఈ సీజన్ మొదలైన జూన్ 24 నుంచి 238 మంది మరణించారు. 40 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మొత్తం 10వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.