బీఆర్ఎస్, బీజేపీ దళిత విరోధ పార్టీలు : మాయావతి - పెద్దపల్లి సభలో మాయవతి
🎬 Watch Now: Feature Video
Published : Nov 23, 2023, 7:54 PM IST
BSP Chief Mayawati At Peddapalli Sabha : తెలంగాణలో బీఆర్ఎస్, దేశంలో బీజేపీ.. దళిత విరోధ పార్టీలు అని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. పెద్దపల్లిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆమె.. బీఆర్ఎస్, బీజేపీ పాలనలో దళితులు, మైనార్టీలు, ఓబీసీ, అగ్రవర్ణ పేదల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగం, అధిక ధరలు వంటి సమస్యలు.. పేదలను అవస్థలకు గురి చేస్తున్నాయని తెలిపారు. మతతత్వ పార్టీలు, కుటుంబ పార్టీల వల్లే.. ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. దేశంలో, తెలంగాణలో.. అవినీతి కూడా పెరిగిపోయిందని విమర్శించారు. అన్ని వర్గాల మద్దతు కూడగట్టి తెలంగాణలో బహజన రాజ్యాన్ని స్థాపిస్తామని.. మాయావతి పేర్కొన్నారు.
"తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ.. దళితులకు వ్యతిరేకమని నాకు అర్థమైంది. దళితులు తమ కాళ్లపై తాము నిలబడడం.. ఈ పార్టీకి ఇష్టం లేదు. వాళ్లు అధికారంలోకి రాకూడదని భావిస్తోంది. అందుకే... మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టింది. దీని ద్వారా ఆ పార్టీ దళిత విరోధి అన్న మానసిక స్థితి అర్థమవుతోంది. ఇలాగే దేశమంతటా ముస్లిం మైనార్టీలు, ఇతర బలహీన వర్గాల పరిస్థితి ఇంతకంటే మెరుగ్గా ఏమీ లేదు. " - మాయవతి, బీఎస్పీ అధినేత్రి