'మేం ప్రతిపాదించిన సవరణలను వెనక్కి తీసుకున్నాం - ఆ పదాలను మాత్రం రికార్డు నుంచి తొలగించాలి' - తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ఫైర్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 16, 2023, 10:26 PM IST

BRS MLC Kavitha Objection to Governor Tamilisai Speech : గవర్నర్ ప్రసంగానికి కొన్ని సవరణలు చేయాలని బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకున్నారు. గవర్నర్ తమిళిసై ప్రసంగంలో గత ప్రభుత్వాన్ని నిరంకుశ, నిర్భంధ ప్రభుత్వంగా దూషించారని ఆమె మండిపడ్డారు. తొలి రోజు కావడంతో సవరణలు వెనక్కి తీసుకునేందుకు ఆమె అంగీకరించారు. అయితే ఆ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ఆ పదాలు రికార్డుల్లో నుంచి తొలగించాలని కోరినట్లు కవిత తెలిపారు. మండలి సమావేశం ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఉభయసభల్లో జరిగిన గవర్నర్​ ప్రసంగంపై ప్రజలు చాలా బాధపడ్డారని తెలిపారు. 

ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని మండలిలో బీఆర్​ఎస్​కు మెజారిటీ ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వానికి సహకరించాలన్న ఉద్దేశంతో ప్రజలకు ఓ సందేశం ఇవ్వాలనుకున్నామన్నారు. అందుకే మేం ప్రతిపాదించిన సవరణలు వెనక్కి తీసుకున్నామని స్పష్టం చేశారు. ఆ స్ఫూర్తిని ప్రభుత్వం కొనసాగించాలని, రాష్ట్ర ప్రగతిపై రోడ్ మ్యాప్‌ ప్రజలకు వివరించాలని కవిత డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.