Bridge Collapsed in Adilabad : వర్షాలకు కూలిన వంతెన.. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య నిలిచిపోయిన రాకపోకలు - Telangana latest news
🎬 Watch Now: Feature Video
Published : Sep 10, 2023, 8:30 PM IST
Bridge Collapsed in Adilabad : ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు.. తలమడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామ సమీపంలో రహదారి పైవంతెన కూలిపోయింది. ఫలితంగా తెలంగాణ, మహారాష్ట్ర మధ్య అంతర్రాష్ట్ర రాకపోకలు నిలిచిపోయాయి.
Heavy Rains in Adilabad : ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన మహోర్కి, ఉన్నికేశ్వర్లకు.. ఈ మార్గం గుండానే ప్రయాణాలను కొనసాగిస్తారు. వీటితో పాటు కిన్వట్, మాండ్వి ప్రాంతాలకు రాకపోకలు ఆగిపోయాయి. రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. కొందరు మరో మార్గం గుండా వాహనాలు మళ్లించారు. వరద ఉద్ధృతికి రోడ్డు మధ్యలోనే బ్రిడ్జి చీలిపోవడంతో.. లక్ష్మీపూర్ గ్రామానికి రాకపోకలు ఆగిపోయాయి. కొత్తవారు వచ్చినప్పుడు ప్రమాదం జరగకుండా.. ప్రమాద సూచికలు ఏర్పాటుచేశారు. బ్రిడ్జి నిర్మించి చాలాకాలం కావడంతో.. శిథిలావస్థకు చేరుకుందని స్థానికులు పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే రోడ్డు బాగు చేసి నూతన బ్రిడ్జిని నిర్మించాలని.. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.