Live Video : అంత్యక్రియలకు వెళ్తుండగా విషాదం.. పడవ బోల్తా పడి మామాఅల్లుళ్లు మృతి - నాలుగేళ్ల చిన్నారితో మామ మృతి కేరళ
🎬 Watch Now: Feature Video
Boat Capsized In Kerala : కేరళలోని కొట్టాయం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రయాణిస్తున్న చిన్న పడవ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మామఅల్లుళ్లు మృతిచెందారు. మిగతా నలుగురిని అగ్నిమాపక దళం కాపాడి ఆస్పత్రికి తరలించింది. మృతులను పుత్తంతర శరత్ (33), అతడి మేనల్లుడు ఇవాన్ (4)గా గుర్తించారు. ఈ ఘటన బుధవారం జరిగింది.
ఇదీ జరిగింది.. కొట్టాయం జిల్లా వాయీకమ్ మండలం సమీపంలోని ఉదయపురానికి చెందిన శరత్.. తన తండ్రి, తల్లి, సోదరి, ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి చిన్న పడవలో అంత్యక్రియలకు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న సమయంలో బోటుకు రంధ్రం పడి.. నీళ్లు పడవలోకి వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ క్రమంలో పడవ వాయీకమ్ మండలం తలయాజం గ్రామం సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సహాయక బృందం నలుగురిని రక్షించింది. ఇవాన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పరిస్థితి విషయంగా ఉన్న శరత్ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శరత్ మృతిచెందాడు.