బీజేపీ కార్యాలయానికి నీలం రంగు... ఎవరి పనై ఉంటుందబ్బా..! - BJP office painted blue in hyderabad
🎬 Watch Now: Feature Video
బీజేపీ అధిష్ఠానం సౌత్ రాష్ట్రాలపై ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైన అధికారాన్ని చేజిక్కించుకోవాలనే వ్యూహాలతో ముందుకు అడుగులు వేస్తోంది. అయితే ఇదిలా హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ప్రధాన గేటుపై గుర్తు తెలియని వ్యక్తులు నీలిరంగు చల్లారు. రెండు బైక్‌లపై వచ్చి... బీజేపీ ప్రధాన ద్వారంపై నీలి రంగు చల్లి పారిపోయారు. వారు ఎవరు అనేది గుర్తు పట్టరాకుండా ఉంది. అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయినప్పటికీ.. చీకటి కావడం వల్ల గుర్తు తెలియడం లేదు. ఇదే విషయంపై బీజేపీ కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్ అబిడ్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అర్థరాత్రి ఒంటి గంట 25 నిమిషాలకు గుర్తు తెలియని దుండగులు వచ్చి నీలి రంగు చల్లి వెళ్లారని ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న అబిడ్స్ పోలీసులు... దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించారు. ఒకవేళ నిరసనగా ఈ పని చేశారా అని ఆరా తీస్తున్నారు.