'మద్యంతో మభ్యపెట్టే రోజులు ఇక చెల్లవు - మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిది ధనబలం, నాది జన బలం' - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
🎬 Watch Now: Feature Video
Published : Nov 13, 2023, 2:00 PM IST
BJP Candidate Maheshwar Reddy Fires On Indrakaran Reddy : రాష్ట్ర మంత్రిగా రెండుసార్లు అవకాశం వచ్చినప్పటికీ ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గానికి చేసింది శూన్యమని బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. పూటకో రాజకీయ పార్టీ మార్చే ఇంద్రకరణ్ రెడ్డి రాజకీయ చరిత్ర అంతా భూకబ్జాలు, మద్యం వ్యాపారంతోనే సరిపోయిందని ధ్వజమెత్తారు. చెరువులో కలెక్టరేట్‌ను నిర్మించి వందల ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించారని.. నిర్మల్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడగొడతారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీకి పోటీ కాదని తెలిపారు. బీజేపీ 50 వేల మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గెలిచాక నిర్మల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.
"మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిది ధనబలం.. నాది జన బలం. ప్రజలను మద్యంతో మభ్యపెట్టడం ఇక నడవదు. ఇంద్రకరణ్‌రెడ్డి వందల ఎకరాల్లో భూకబ్జాలు చేశారు. మున్సిపల్లో 40 ఉద్యోగాలు అమ్ముకున్నారు. రాబోయే రోజుల్లో 50 వేల మెజార్టీతో బీజేపీ గెలుస్తుంది.-ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, నిర్మల్ బీజేపీ అభ్యర్థి