Jithender Reddy Latest News : 'బీజేపీపై వదంతులు వ్యాప్తి చేయడం ఆపండి' - జితేందర్​ రెడ్డి ప్రెస్​మీట్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 3, 2023, 4:47 PM IST

BJP Leader Jithender Reddy Latest News : కాంగ్రెస్‌, బీఆర్​ఎస్​ గిమ్మిక్కులకు భయపడమని బీజేపీ నేత జితేందర్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ సహా బీజేపీలో అందరం కలిసి పని చేసే వాళ్లమేనని అన్నారు. ఈ క్రమంలోనే గతంలో తాను చేసిన ట్వీట్​లను ఎలా అర్థం చేసుకున్నా.. తనకు నష్టం లేదన్నారు. ట్వీట్‌కు వివరణలు, అర్థాలు, తాత్పర్యాలు ఉండవన్నారు. ఈటలతో తనకు ఎలాంటి విబేధాలు లేవని సూచనప్రాయంగా వెల్లడించారు. బీజేపీపై వదంతులు వ్యాప్తి చేయడం ఆపితే చాలని మాజీ ఎంపీ కోరారు. బీజేపీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామన్నారు. 

అంతకుముందు జితేందర్‌ రెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన ఈటల రాజేందర్​తో ఆయన భేటీ అయ్యారు. అరగంట పాటు సమావేశమైన ఇరువురు నేతలు.. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీలో అంతర్గత పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉద్యమంలో ఈటలతో కలిసి పని చేశానని జితేందర్​రెడ్డి తెలిపారు. తాను దిల్లీలో ఉన్నప్పుడు ఈటల వచ్చి కలిసేవారని.. ప్రస్తుతం తనకు దిల్లిలో పని లేదని.. పాలమూరు ప్రజలకు సేవ చేయడమే కర్తవ్యమని అన్నారు. ఈటలకు అదనపు బాధ్యతలు ఇస్తే మంచిదని పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గరల్లో ఉన్నందున మౌనంగా ఉన్నానని.. లేదంటే రాహుల్​ గాంధీకి సవాల్ విసిరేవాడినని తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.