బీజేపీ అభ్యర్థుల చేతుల్లోనే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఓడటం ఖాయం : కిషన్‌రెడ్డి - కాంగ్రెస్‌పై కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు
🎬 Watch Now: Feature Video
Published : Nov 11, 2023, 5:33 PM IST
BJP Chief Kishan Reddy Slams BRS And Congress Party : బీజేపీ అభ్యర్థుల చేతుల్లోనే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఓడిపోవడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడానికి బీజేపీకి అవకాశముందని తెలిపారు. త్వరలోనే బీజేపీ ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తామని చెప్పారు. బీజేపీ అగ్రనేతలు, శివసేన నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
'బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒకటేనని రాహుల్‌గాంధీ అంటున్నారు. ఎంఐఎం పార్టీతో కలిసే అవకాశమే లేదు. మజ్లిస్ పార్టీతో కలిసి లాభపడింది కాంగ్రెస్. మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మజ్లిస్‌తో కలవబోము, వాళ్ళతో లాభపడింది, పొత్తు పెట్టుకున్నది కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే. మతకలహాలు చేసే పార్టీతో మేము కలిసేది లేదు. కేసీఆర్ ఒక భుజంపై అక్బరుద్దీన్, మరో భుజంపై అసదుద్దీన్‌ను పెట్టుకుని తిరుగుతున్నారు.' అని కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కర్ణాటకను కాంగ్రెస్ భ్రష్టు పట్టించిందని విమర్శించారు. బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే.. బీఆర్ఎస్ తిన్న అవినీతి సొమ్మును బయట పెట్టిస్తామని తెలిపారు.