గుజరాత్​ను వణికించిన బిపోర్​జాయ్​.. 140 కి.మీ వేగంతో గాలులు.. భారీగా ఆస్తి నష్టం! - biporjoy cyclone maharashtra

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 16, 2023, 2:25 PM IST

గుజరాత్​లో బిపోర్​జాయ్​ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దాదాపు 140 కి.మీ వేగంతో గాలులు వీయటం వల్ల.. ఎన్నో చెట్లు నేలకొరిగాయి. కరెంట్ స్తంభాలు సైతం కుప్పకూలాయి. తుపాను ధాటికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పార్కింగ్​లో ఉన్న వాహనాలు చెల్లాచెదురయ్యాయి. తుపాను పట్ల నిత్యం అప్రమత్తంగా ఉన్న అధికారులు.. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ముందు జాగ్రత్తగా 631 మంది వైద్య సిబ్బందిని, 504 అంబులెన్స్​లను అందుబాటులో ఉంచారు. ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​​డీఆర్​ఎఫ్​, భారత సైన్యం, బార్డర్​ సెక్యూరిటీ ఫోర్స్​ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. అదే విధంగా నావిక దళం, ఎయిర్​ఫోర్స్​, కోస్ట్​గాల్​, బార్డర్​ సెక్యూరిటీ ఫోర్స్​ కూడా.. ముమ్మరంగా సహాయక చర్యల్లో భాగం పంచుకుంటున్నాయి.

కరెంట్​​ స్తంభాలు పడిపోవడం వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యుత్​ పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపట్టారు. నేలకొరిగిన చెట్లను తొలగిస్తూ.. కుప్పకూలిన కరెంట్​ స్తంభాలను తిరిగి అమర్చుతున్నారు. తుపాను వాయువ్య దిశగా కదులుతున్నందున శుక్రవారం, శనివారం రాజస్థాన్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతవరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. రాజస్థాన్ మీదుగా ఈ సాయంత్రం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.