మహిళా అధికారి వీరంగం- సహోద్యోగుల తలపై కొడుతూ దారుణం- సీసీటీవీకి చిక్కి! - భిలాయ్ స్టీల్ మహిళ అధికారి గొడవ
🎬 Watch Now: Feature Video


Published : Nov 25, 2023, 7:42 PM IST
Bhilai Steel Plant Female Officer Fight : ఛత్తీస్‌గఢ్ దుర్గ్ జిల్లాలోని భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో మహిళా అధికారి వీరంగం సృష్టించారు. కంప్యూటర్లు, సీసీ కెమెరాలు పగలగొట్టి.. ట్రైనీవర్కర్ ఆస్తా సోనీ అనే మహిళను టిఫిన్ బాక్స్‌తో తలపై కొట్టారు. అక్కడి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడం.. పత్రాలపై నీళ్లు పోయడం వంటి దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
భిలాయ్ స్టీల్ ప్లాంట్ (బీఎస్‌పీ) అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయమైన ఇస్పాత్ భవనంలో.. అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా (AGM) పని చేస్తున్న ప్రియాంక హోరో గురువారం మధ్యాహ్నం కార్యాలయంలో గందరగోళం సృష్టించారు. మహిళా ట్రైనీవర్కర్ ఆస్తా సోనీని టిఫిన్ బాక్స్‌తో తలపై కొట్టారు. కంప్యూటర్లు, సీసీ కెమెరాలు పగలగొట్టి, సీఐఎస్‌ఎఫ్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. పలు పత్రాలపై నీళ్లు పోయడం వంటి పనులు చేశారు. మహిళా అధికారి చేసిన ఈ తతంగం మొత్తం దృశ్యాలు మరో సీసీటీవీలో రికార్డయ్యాయి.
ఏజీఎంను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు : మహిళా అధికారి ప్రియాంక చేసిన చర్యలకు నివ్వెరపోయిన ఉద్యోగులు బీఎస్‌పీ (భిలాయ్ స్టీల్ ప్లాంట్) ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం గొడవ సృష్టించిన ప్రియాంకను బీఎస్‌పీ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రియాంక హూరో 2021లో కూడా ఇలాగే గొడవపడ్డారు. అయితే ఆ సమయంలో బీఎస్‌పీ అధికారులు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సిబ్బంది చెబుతున్నారు. ప్రియాంక భర్త కూడా ఇక్కడే పనిచేస్తున్నారని.. కానీ ఆమె తన భర్తతో కలిసి ఉండడం లేదని తెలిపారు. ప్రస్తుతం జరిగిన ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తైన అనంతరం మహిళపై అధికారిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.