Bhatti Vikramarka Reacts on Chandrababu Arrest : 'వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలను ప్రజాస్వామ్యం అంగీకరించదు' - నారా చంద్రబాబు అరెస్టు
🎬 Watch Now: Feature Video
Published : Sep 12, 2023, 6:50 PM IST
CLP Bhatti Vikramarka Reacts on Ex AP CM Chandrababu Arrest : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్టుపై దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నేతలు స్పందిస్తున్నారు. తాజాగా తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ప్రజాస్వామ్యానికి ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ మూలస్తంభాలని.. సిద్ధాంతాల పరంగా రాజకీయ పార్టీలకు వైరుధ్యాలు ఉన్నప్పటికీ.. వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలను ప్రజాస్వామ్యం అంగీకరించదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశంలో ఏపీలో ప్రతిపక్ష నేత అరెస్టుపై స్పందన అడగ్గా.. భట్టి విక్రమార్క పై విధంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడా కక్షసాధింపు చర్యలకు తావు ఉండొద్దన్నారు. ప్రధాని మోదీ.. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని గుర్తు చేశారు. దేశం నివ్వెరపోయేట్లు రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేశారన్నారు. ఆయన నివాసం ఉండే ఇంటి నుంచి బయటకు గెంటేశారని భట్టి వ్యాఖ్యానించారు.