పోలీసుల దొంగపని.. గస్తీకి వచ్చి ఫ్యాన్ చోరీ.. చివరకు అడ్డంగా బుక్కై.. - పోలీసుల ఫ్యాన్ దొంగతనం
🎬 Watch Now: Feature Video
బిహార్ భాగల్పుర్ జిల్లాలో పోలీసులే దొంగతనానికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నైట్ పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు.. వాహనాన్ని ఆపి ఓ ఇంటి ముందు ఉన్న టేబుల్ ఫ్యాన్‌ను ఎత్తుకెళ్లారు. ఫ్యాన్‌ను తీసుకొని వారు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సెప్టెంబర్ 26న అర్ధరాత్రి ధోల్బాజా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇంటి యజమాని సుబోధ్ చౌదరి.. తొలుత చుట్టుపక్కలవారిని అడిగాడు. అనంతరం సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాడు. దీంతో పోలీసు దొంగలు దొరికిపోయారు. దీనిపై ఆరా తీసేందుకు వెంటనే పోలీసుల వద్ద వెళ్లాడు సుబోధ్. అయితే, ముందుగా పోలీసులు బుకాయించారు. స్టేషన్ నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. అయితే, సీసీటీవీ వీడియో చూయించాక.. పోలీసులు ఆశ్చర్యపోయారు. అనంతరం ఫ్యాన్‌ను తిరిగి ఇచ్చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST