కోతులను చంపి కాల్చుకుని తిన్న యాచకులు - పోలీసులకు పట్టించిన గ్రామస్థులు - భైంసా వైరల్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Published : Dec 13, 2023, 11:04 AM IST
Beggars Killed Monkeys to Eat in Bhainsa : నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని చింతల్ బోరి గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మూడు రోజుల నుంచి భిక్షాటన చేస్తూ ఆరుగురు వ్యక్తులు గ్రామంలో ఉంటున్నారు. మంగళవారం రోజు రాత్రి సమయంలో వారంతా కలిసి గ్రామ సమీపంలో నాలుగు వానరాలను చంపారు. వాటిని వండుకుని తిందామని ప్లాన్ వేశారు.
కోతి మాంసాన్ని కాలుస్తున్న సమయంలో వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆరుగురిలో ఓ వ్యక్తి గ్రామ ప్రజల వద్దకు వెళ్లి తన తోటి యాచకులు కోతులను చంపి వండుకుని తింటున్నారని వారితో చెప్పాడు. వెంటనే అక్కడికి చేరుకున్న గ్రామస్థులు ఆ పరిసరాలను చూసి షాక్ అయ్యారు. కోతి తల, కాళ్లు, చేతులను మంటలో కాల్చి తినడానికి సిద్ధం చేసి ఉండటం గమనించి కంగుతిన్నారు.
వెంటనే యాచకులను నిలదీయడంతో చేసిన తప్పును వారు ఒప్పుకున్నారు. తాము పూజించే వానారాన్ని ఎందుకు చంపారని గ్రామస్థులు వారిని నిలదీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులు అక్కడికి వచ్చే సరికి ఆరుగురిలో నలుగురు వ్యక్తులు పారిపోయారు. అక్కడే ఉన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.