Bedurulanka 2012 Movie Team in Narasapuram: నరసాపురంలో 'బెదురులంక 2012'.. ఇంజినీరింగ్ విద్యార్థులతో సందడి - హీరోయిన్ నేహా శెట్టి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-08-2023/640-480-19237432-542-19237432-1691725362543.jpg)
Bedurulanka 2012 Movie Team in Narasapuram: గోదావరి జిల్లాలతో తనకు మంచి అనుబంధం ఉందని హీరో కార్తికేయ అన్నారు. ఆయన హీరోగా, నేహాశెట్టి హీరోయిన్గా నటించిన బెదురులంక 2012 సినిమా బృందం గురువారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించింది. ఈ నెల 25న చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ప్రచారంలో భాగంగా వారిరువురు చిత్ర యూనిట్‌తో కలిసి సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులతో కలిసి సందడి చేశారు. ప్రతి ఒక్కరూ థియేటర్‌కు వచ్చి సినిమా చూడాలని కోరారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో కార్తికేయ మాట్లాడారు. బెదురులంక టీజర్, పాటలు ఇప్పటికే విడుదల చేశామని, వాటికి మంచి పేరు వచ్చిందన్నాపు. వంద శాతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని వెల్లడించారు. హీరోయిన్ నేహాశెట్టి మాట్లాడుతూ.. ప్రేక్షకులందరూ సినిమా చూసి నవ్వుతూ థియేటర్ నుంచి బయటకు వస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాలేజీ సెక్రటరీ సత్యనారాయణ, డైరెక్టర్ అడ్డాల శ్రీహరి, కోశాధికారి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయాన్ని గురువారం రాత్రి హీరో, హీరోయిన్దర్శించుకున్నారు.