30 నిమిషాల్లో 23 వేల పేపర్బోట్ల తయారీ గిన్నిస్ బుక్‌లో చోటు - బాలి యాత్ర
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16941769-thumbnail-3x2-eee.jpg)
ఒడిశాలోని కటక్‌లో జరుగుతున్న చరిత్రాత్మక బాలి యాత్ర గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. యాత్రలో భాగంగా సీఎంసీ నిర్వహించిన పేపర్ బోట్ల తయారీ కార్యక్రమంలో 22 పాఠశాలలకు చెందిన 2121 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 30 నిమిషాల్లో 23 వేలకుపైగా పేపర్ బోట్లను తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ సుభాశ్ సింగ్, జిల్లా కలెక్టర్ భవానీశంకర్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు సంబంధించిన అధికారులు హాజరై సర్టిఫికేట్‌ను అందించారు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST