Attempted Murder of Boy in Jagadgirigutta : బ్లేడుతో బాలుడి గొంతు కోసి హత్యాయత్నం.. సీసీటీవీ దృశ్యాలు వైరల్ - Telangana latest news
🎬 Watch Now: Feature Video

Boy Murder Attempt in Jagadgirigutta Viral Video : మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఆది అనే తొమ్మిదేళ్ల బాలుడిపై ఆటో డ్రైవర్ హత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఆటోలో వచ్చిన దుండగుడు బాలుడికి మాయమాటలు చెప్పి.. పక్క వీధిలోకి తీసుకెళ్లి బ్లేడుతో గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు. బాలుడిపై దాడి చేస్తున్న దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. స్థానికులు గమనించి కేకలు వేయడంతో.. వారిని చూసి నిందితుడు పరారయ్యాడు. అప్రమత్తమైన స్థానికులు రక్తపు మడుగులో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న బాలుడిని.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ రికార్డులను పరిశీలిస్తూ.. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు రాబడుతున్నారు. డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రసుత్తం బాలుడికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని.. పరిస్థితి విషమంగా ఉందని జగద్గిరిగుట్ట సీఐ తెలిపారు.