Attari Railway Station : నిర్మానుష్యంగా భారత చివరి రైల్వే స్టేషన్.. పాక్‌కు సేవలు పునరుద్ధరించాలని ప్రజల విజ్ఞప్తి! - భారత్ పాక్ సరిహద్దు అట్టారీ రైల్వేస్టేషన్
🎬 Watch Now: Feature Video
Published : Oct 16, 2023, 2:49 PM IST
Attari Railway Station : ఒకప్పుడు ప్రయాణికులతో రద్దీగా ఉండే అట్టారీ రైల్వే స్టేషన్.. ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. భారతదేశ చివరి రైల్వే స్టేషన్‌గా పిలిచే ఈ రైల్వే స్టేషన్లో.. పాకిస్థాన్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత.. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రద్దవడం వల్ల పాకిస్థాన్‌కు వెళ్లేందుకు ఉన్న ఏకైక రైలు మార్గం మూతపడినట్లైంది. ఈ కారణంగా పాకిస్థాన్‌లోని గురుధామ్కు వెళ్లే సిక్కు యాత్రికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరితో పాటు రైల్వే స్టేషన్ మూతపడటం వల్ల చుట్టు పక్కల ప్రాంతాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో అట్టారీలో ఒకప్పుడు దాబాలు నిర్వహించిన వారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వారు సైతం ఇప్పుడు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఈ మార్గం గుండా వస్తువులు ఎగుమతి, దిగుమతులు చేసేవారి వ్యాపారం పూర్తిగా ఆగిపోయింది. దీనికి తోడు రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన రైల్వే స్టేషన్ కూడా ఖాళీగా ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే స్టేషన్‌పై దృష్టిసారించాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఈ అట్టారీ రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరిస్తే ఇక్కడున్న వారికి ఉపాధి లభిస్తుందని విజ్ఞప్తి చేస్తున్నారు.