ఆన్‌లైన్లో యువతికి అసభ్యకరమైన సందేశాలు - దేహశుద్ధి చేసిన కుటుంబ సభ్యులు - ఆన్‌లైన్‌లో యువతిను వేధించిన యువకుడిపై దాడి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 26, 2023, 7:25 PM IST

Attack on Young Man Who Torturing Girls in Online : అమ్మాయిల ఆన్‌లైన్లో వేధింపులకు గురి చేస్తున్న యువకుడికి దేహశుద్ధి చేసిన ఘటన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సురారం పోలీస్‌ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం డయాగ్నొస్టిక్ సెంటర్‌లో పని చేస్తున్న నాని అలియాస్ సికిందర్ అనే వ్యక్తి బీఎస్సీ వరకు చదివాడు. అనంతరం గంజాయికి బానిసయ్యాడు. 

డయాగ్నొస్టిక్ సెంటర్‌లో పని చేస్తున్న అతను అక్కడికి  వచ్చే మహిళలు, యువతులు ఫోన్‌ నెంబర్లు తీసుకునేవాడు. తర్వాత వారిని వేధింపులకు గురి చేస్తున్నారని బాధిత యువతి తెలిపారు. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరంగా మెసేజ్‌లు చేస్తున్నాడని వాపోయింది. ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అడిగితే తనని ఎవరూ ఏమి చేయలేరంటూ అశ్లీల సందేశాలతో ఇబ్బందులకు గురి చేస్తుంటాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. వీటిని భరించలేని యువతి వారి కుటుంబ సభ్యులకు తెలపడంతో అతని నంబరు కనుక్కొని దేహశుద్ధి చేశారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.