ఆటోలో అమెరికా విదేశాంగ మంత్రి షికార్లు.. మసాలా ఛాయ్ టేస్ట్..
🎬 Watch Now: Feature Video
జీ20 సమావేశాల్లో భాగంగా భారత్ విచ్చేసిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆటోలో షికార్లు కొట్టారు. దిల్లీ వీధుల్లో ఆటోలో ప్రయాణించి సందడి చేశారు. దీంతో పాటుగా ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన చిన్నారులతో సరదాగా గడిపారు ఆంటోనీ బ్లింకెన్. అనంతరం అక్కడ ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. అమెరికా-భారత్ మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసేందుకు భారత్‌లో కృషి చేస్తున్న వివిధ రాష్టాల కాన్సులేట్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో సంరక్షిచడంలో అమెరికా, భారత్ నిబద్ధతకు తన పర్యటన అద్దంపడుతోండని ఆయన పేర్కొన్నారు. అనంతరం క్వాడ్ సభ్యదేశాలైన భారత్, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరితో కలిసి చైనా దూకుడుకు కళ్లెం చేసేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలను చర్చించినట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్‌లోని మసాలా ఛాయ్‌ను రుచి చూడడం సహా.. ప్రతిభావంతులైన మహిళలతో కూడా సమావేశమయ్యానని బ్లింకెన్ తెలిపారు. సమయం దొరికితే తాను ఎక్కువగా భారత్‌లోనే కాలం గడపడడానికి ఇష్టపడుతానని బ్లింకెన్ చెప్పారు.