Anantnag Martyrs Last Rites : అమర జవాన్లకు ఘన నివాళులు.. దారిపొడవునా నిల్చుని పూలవర్షం - అనంతనాగ్ కాల్పులు
🎬 Watch Now: Feature Video
Published : Sep 15, 2023, 2:16 PM IST
Anantnag Martyrs Last Rites : జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అమరుడైన మేజర్ ఆశిష్ ధోనక్కు ఘనంగా వీడ్కోలు పలికారు. తన స్వగ్రామమైన హరియాణాలోని బింజోల్‌లో బంధు మిత్రులు, గ్రామస్థుల ఆశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. మేజర్‌ను కడసారి చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దారిపొడవునా నిల్చుని 'భారత్ మాతా కీ జై' అంటూ నినాదాలు చేశారు. విద్యార్థులు సైతం రోడ్డుకు ఇరువైపులా నిలబడి నినదించారు. అశిష్ ధోనక్ భౌతికకాయంపై జాతీయ జెండాను ఉంచిన సైన్యం గాల్లోకి కాల్పులు జరిపి అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది.
మరో సైనికుడు కర్నల్ మన్‌ప్రీత్ సింగ్ భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించింది సైన్యం. పంచకులాలోని కమాండ్ ఆస్పత్రి నుంచి స్వగ్రామమైన మొహాలీకి తరలించారు. దారిపొడవునా నిల్చుని స్థానికులు నివాళులు అర్పించారు. అనంతనాగ్ జిల్లాలోని కొకర్‌నాగ్ ప్రాంతంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో మేజర్ అశిష్‌తో పాటు కర్నల్ మన్‌ప్రీత్ సింగ్, DSP హుమాయున్ భట్ ప్రాణాలు కోల్పోయారు.