Ambedkar Statue: సాగర తీరాన.. త్రీడీ వెలుగుల్లో కాంతులీనుతున్న అంబేడ్కర్ విగ్రహం - ఏప్రిల్ 14న అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
🎬 Watch Now: Feature Video
Ambedkar Statue in Hyderabad : దేశానికే రాజ్యాంగాన్ని రచించి.. భవిష్యత్తు దిక్సూచిని ఇచ్చిన మహానుభావుడు మన భారతరత్న డాక్టర్ భీం రావ్ రాంజీ అంబేడ్కర్. అంతటి మహనీయుడి సేవలను స్మరించుకుంటూ.. ఆయన 132వ జయంతి సందర్భంగా హుస్సేన్ సాగర్ తీరాన అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశంలోనే అతి ఎత్తైన, పెద్దదైన అంబేడ్కర్ విగ్రహంగా చరిత్ర పుటల్లో నిలిచింది.
అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తరహాలో నిర్మించిన ఈ అద్భుత కట్టడం చూపరులకు కనువిందు చేయనుంది. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణను రాష్ట్ర ప్రభుత్వం చేయనుంది. అందులో భాగంగా గురువారం రాత్రి విద్యుత్ ధగధగల్లో రాజ్యాంగ నిర్మాత మెరిసిపోతున్నారు. శుక్రవారం అనంతాకాశంలో.. అంబేడ్కర్ ఆవిష్కరణ నేపథ్యంలో విగ్రహాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. త్రీడీ లైటింగ్ ఆకట్టుకుంటోంది. వివిధ రంగులతో కూడిన దీపాలతో అంబేడ్కర్ అతిపెద్ద విగ్రహం కాంతులీనుతోంది. ట్యాంక్‌బండ్ నుంచి వెళ్లే వాహనదారులు, పాదచారులకు త్రీడీ లైటింగ్ ప్రదర్శన కనుల విందును కలిగిస్తోంది.