తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి ఇంటి వద్ద పూర్వ విద్యార్థుల శ్రమ దానం - తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి
🎬 Watch Now: Feature Video
Published : Nov 2, 2023, 11:00 AM IST
Alumni Shramadanam Program at Ravi Narayana Reddy House : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, భారత పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన కీ.శే. రావి నారాయణరెడ్డి గౌరవార్థం యాదాద్రి భువనగిరి మండలం బొల్లేపల్లిలో ఉన్న ఆయన ఇంటి వద్ద జడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు శ్రమదానం నిర్వహించారు. నారాయణరెడ్డి ఇంటి పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో 1965 నుంచి 2023 వరకు బొల్లేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన విద్యార్థులు పాల్గొన్నారు. వందేమాతర గీతం ఆలపించి.. శ్రమదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Telangana Freedom Fighter Honor Of MP Ravi Narayana Reddy : ఈ సందర్భంగా రావి నారాయణరెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని వారు గుర్తు చేశారు. ఆయన తిరిగిన ఇంటి పరిసర ప్రాంతాలను శ్రమ దానం ద్వారా శుభ్రం చేయడం దేవుడి మాఢ వీధులను శుభ్రం చేస్తున్నట్లుగా భావిస్తున్నామని పేర్కొన్నారు. రావి నారాయణరెడ్డి జీవితం ఎందరికో ఆదర్శమని కొనియాడారు. ఆయన లాంటి గొప్ప వ్యక్తి గురించి భావితరాలకు తెలియజేయాలని భావించి శ్రమ దానం ద్వారా ఆయన ఇంటిని శుభ్రం చేసినట్లు తెలిపారు.