అక్షర్​ధామ్​ ఆలయంలో దీపావళి వేడుకలు- 'గ్లో గార్డెన్​ థీమ్'​తో 10వేల దీపాలంకరణ! - అక్షర్​ధామ్​ ఆలయం గాంధీనగర్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2023, 9:33 PM IST

Akshardham Temple Gujarat Diwali Celebration : గుజరాత్​.. గాంధీనగర్​లో ఉన్న అక్షర్​ధామ్​ ఆలయంలో పది వేల దివ్వెలతో దీపావళి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయ ఆవరణలోని ఉన్న తోటలో 100కుపైగా విద్యుత్​ దీపాలను గ్లో గార్డెన్​ థీమ్​తో అలంకరించారు ఆలయ నిర్వాహకులు. 1990ల్లో నిర్మితమైన ఈ ఆలయంలో ఏటా 10వేల దీపాలను ఆలయ వాలంటీర్లు వెలిగిస్తున్నారు. 32ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతున్నట్లు తెలిపారు.

"సాధారణంగా ప్రతి సోమవారం.. అక్షర్​ధామ్​ ఆలయంలో లైటింగ్​ ఆపివేస్తాం. కానీ ఈ సారి దీపావళి పండుగ సందర్భంగా మరిన్ని విద్యుత్​ దీపాలతో అలకరించాం. సోమవారం పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించనున్నారు. రానున్న రోజుల్లో ఆలయం వెలుపల 49 అడుగుల స్వామి నారాయణ్​ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది" అని గాంధీనగర్ అక్షరధామ్ స్వామినారాయణ ఆలయ వాలంటీర్ జయేశ్​ మండల్కర్ ఈటీవీ భారత్‌తో తెలిపారు. మరోవైపు, శ్రీ రామ జన్మభూమి అయోధ్యలో దీపోత్సవ్​ కార్యక్రమం ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన వీడియోను చూసేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.