Mohan Babu Latest News : మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు చిందులు.. - Mohan Babu expressed anger media representatives
🎬 Watch Now: Feature Video
Mohan Babu Expressed Anger Media Representatives : సినీ నటుడు మంచు మోహన్‌బాబు వ్యక్తిగత పని నిమిత్తం.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పలువురు మీడియా ప్రతినిధులు కార్యాలయం దగ్గరికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే పని ముగించుకుని బయటికి వస్తున్న మోహన్‌బాబును.. వారు సెల్‌ఫోన్లలో బంధించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే సహనం కోల్పోయిన ఆయన బయటికి వచ్చాక మీడియా ప్రతినిధులపై చిందులు తొక్కారు.
ఈ నేపథ్యంలోనే బుద్ధి లేదా అంటూ మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు అగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మీడియా లోగోలను తీసుకోండని అంటూ తన బౌన్సర్లకు చెప్పారు. దీంతో అక్కడ ఉన్నవారు ఏం జరుగుతుందోనని అలా చూస్తూ ఉండిపోయారు. అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ ఈ విషయం కాస్త పట్టణంలో దావానలంగా వ్యాపించింది. మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు ప్రవర్తించిన తీరును పలువురు తప్పుబడుతున్నారు. మీడియా ప్రతినిధులపై అలా ప్రవర్తించడం సరికాదన్నారు.