ABVP Leaders Protest Gangula Kamalakar office : గంగుల కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు - Agitation in front of Gangula Kamalakar office
🎬 Watch Now: Feature Video
Published : Aug 29, 2023, 9:06 PM IST
ABVP Leaders Protest Minister Gangula Kamalakar office : విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు కరీంనగర్‌లో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఏబీవీపీ నాయకులు కార్యాలయాన్ని ముట్టడించే యత్నంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకరక్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకు వెళ్లారు.
Police Arrest ABVP Leaders in Karimnagar : పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్ షిప్లను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందలేదని తెలిపారు. రాష్ట్రంలో విద్యారంగంలో ఉన్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గతంలో ఇలానే సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ(ABVP) కార్యకర్తలు మంత్రి ఇంటిని ముట్టడించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తమ పోరాటం కొనసాగుతుందని ఏబీవీపీ కార్యకర్తలు తెలిపారు.