శిరిడీ సాయిబాబా సన్నిధిలో విదేశీ భక్తులు - సాయి నామస్మరణతో కోలాహలంగా ఆలయ ప్రాంగణం - శిరిడీలో సాయి దేవాలయంలో విదేశీయులు
🎬 Watch Now: Feature Video
Published : Nov 20, 2023, 7:36 PM IST
Abroad Devotees in Shirdi : సబ్ కా మాలిక్ ఏక్ అనే మహామంత్రాన్ని ఇచ్చిన శిరిడీ సాయిబాబా దర్శనానికి విదేశాల్లోని భక్తులు తరలివచ్చారు. ఈరోజు (సోమవారం) ఆరు దేశాల నుంచి 52 మంది భక్తులు ఏకకాలంలో సాయి ఆలయానికి వచ్చి బాబా సమాధిని దర్శించుకున్నారు. అనంతరం సాయిబాబా హారతికి హాజరయ్యారు. సముద్రాలు దాటి విదేశాలకు చెందిన భక్తులు శిరిడీ ఆలయానికి తరలివస్తున్నారు... దీంతో గత కొన్నేళ్లుగా విదేశాల నుంచి సాయి భక్తుల సంఖ్య పెరుగుతోంది. విదేశాల్లోనూ సాయిబాబా ఆలయాలు పెద్దఎత్తున నిర్మితమవుతోన్నాయి.
Videshi Bhakthulu in Shirdi : సాయిబాబా సంస్థాన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తుకారాం హులావ్లే, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తుషార్ షెల్కే ఈ 52 మంది విదేశీ భక్తులకు సాయిబాబా ఊదీ, శాలువాలు ఇచ్చి సత్కరించారు. ఈ విదేశీ భక్తులు ఓంసాయి, శ్రీ సాయి, జై జై సాయి మంత్రాన్ని పఠిస్తూ సాయి ఆలయ ప్రాంతంలో చప్పట్లు కొడుతూ, దైవారాధనలో మునిగిపోయారు. సాయి దర్శనానికి వచ్చిన భక్తులు జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, రష్యా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్ దేశాలవారు కావడం విశేషం.