మద్యం మత్తులో యువకుడు హల్​చల్​.. రైల్వే ట్రాక్​పై కూర్చుని.. - young man commits Suicide

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 14, 2023, 11:03 PM IST

Updated : Jun 15, 2023, 9:20 AM IST

Young Man On Railway Track : మద్యం మత్తులో ఓ యువకుడు హల్​చల్​ చేశాడు. ఏకంగా రైల్వే ట్రాక్​పై కూర్చున్నాడు. మహారాష్ట్ర ఠాణెలో జరిగిందీ ఘటన. లోకో పైలట్ అప్రమత్తతతో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.​ సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 
ఇదీ జరిగింది..కల్యాణ్ రైల్వే జంక్షన్​లో​ ప్లాట్​ఫామ్ 1లో ఒక లోకల్ ట్రైన్​ బయలుదేరింది. స్టేషన్​ సమీపంలో అదే రైల్వే ట్రాక్​ మధ్యలో ఓ యువకుడు ఉండటాన్ని గమనించిన లోకోపైలట్ రైలును నిలిపివేసి ఆర్పీఎఫ్​ సిబ్బందికి సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన ఆర్పీఎఫ్​ సిబ్బంది అక్కడకు చేరుకొని పట్టాలుపై ఉన్న యువకుడిని అదుపులో తీసుకున్నారు. కాగా మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు ఆత్మహత్య చేసుకునేందుకే రైలు పట్టాలపై పడుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కానీ యువకుడికి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనను ఓ వ్యక్తి మొబైల్​లో బంధించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా ఆర్పీఎఫ్​ సిబ్బంది ఆ యువకుడిని స్థానిక లోహ్​మార్గ్​ పోలీసులకు అప్పగించారు. 

Last Updated : Jun 15, 2023, 9:20 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.