Plane On Srisailam Temple: శ్రీశైలం పరిసరాల్లో విమానం.. ఆలయం చుట్టూ చక్కర్లు - శ్రీశైలం ఆలయం చుట్టూ చిన్న విమానం
🎬 Watch Now: Feature Video
Small Aeroplane Hovered Around Srisailam Temple: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయ పరిసరాల్లో హెలికాఫ్టర్లు, విమానాలు చక్కర్లు కొట్టడం కొన్ని రోజుల నుంచి కలకలం రేపుతోంది. గత నెల 25న తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో హెలికాప్టర్లు సంచరించడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ ఘటన మరువకముందే.. తాజాగా నేడు శ్రీశైలంలోని ఆలయ పరిసరాల్లో చిన్నపాటి విమానం ఎగరడంతో మరోసారి చర్చనీయాంశమైంది. శ్రీశైలంలో ఉదయం పదకొండున్నర గంటల సమయంలో శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వారి ఆలయానికి అతి తక్కువ ఎత్తులో ఓ చిన్నపాటి విమానం ఎగురుతూ కనిపించింది. ఆలయ పరిధిలో.. సుమారు నాలుగైదు రౌండ్లు తిరిగింది. ఆలయ గగనతలంలో విమానం తక్కువ ఎత్తులో ఎగరడం చూసి భక్తులు, స్థానికులు ఆశ్చర్యపోయారు. ఇది ఆలయ భద్రతకు ముప్పనే ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది ఉత్సవాల సమయంలో ఒక ప్రైవేటు హెలికాప్టర్ తక్కువ ఎత్తులో చక్కర్లు కొట్టింది. ఆలయ విహంగ దృశ్యాలు వీక్షించేందుకు ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లను నడుపుతున్నట్లు తెలుస్తోంది.
TAGGED:
plane on srisailam temple